పూలే ఆలోచనలకు దగ్గరగా…జనసేన మూలాలు – పవన్‌ కళ్యాణ్‌

-

చైతన్యమూర్తి పూలే అని.. అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి అటువంటి ప్రజాస్వామ్యం కోసం కలలుగన్న గొప్ప సంఘ సంస్కర్త పూలేనని.. నేడు ఆ మహానుభావుని జయంతి అని వివరించారు.


ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు అర్పిస్తున్నాను.ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త అన్నారు.వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడని వివరించారు. జన సేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం.ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news