వైసీపీలో జంపింగ్ నేతలకు మంచి మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి..ఇప్పటికే పలువురు నేతలకు వైసీపీలో కీలక పదవులు దక్కాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక….చాలామంది టీడీపీ నేతలు..ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే ఇలా వైసీపీలోకి వచ్చిన వారిలో కొంతమందికే పదవులు దక్కాయి…మిగిలిన వారికి పదవులు దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాజీ తమ్ముళ్ళకు సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ లాంటి వారికి సీట్లు ఫిక్స్ అయ్యాయి.
అలాగే పంచకర్ల రమేశ్ బాబు, ఆడారి ఆనంద్, రహమాన్ లాంటి విశాఖ నేతలకు సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. పంచకర్ల..విశాఖ ఉత్తరం సీటు అడుగుతున్నారని తెలుస్తోంది…కానీ అక్కడ వైసీపీ నేత కేకే రాజు…ఈ సారి రాజుకే ఉత్తర సీటు దక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి పంచకర్లకు వేరే సీటు కేటాయించవచ్చు. అలాగే ఆడారి ఆనంద్ విశాఖ పశ్చిమ సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటు చలమలశెట్టి సునీల్, శిద్ధా రాఘవరావు లాంటి నేతలకు సీట్లు దక్కుతాయనేది ఇంకా క్లారిటీ లేదు. గత మూడు ఎన్నికల్లో సునీల్…కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతున్నారు…మరి ఈ సారి ఆయనకు ఏ సీటు ఇస్తారో చూడాలి. అలాగే శిద్ధా సైతం దర్శి సీటు ఆశిస్తున్నారు…తనకు కాకపోయిన, తన కుమారుడుకు సీటు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
అటు కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. మరి ఈ సీటు ఎస్వీకు ఇస్తారా? లేదా? అనేది డౌట్. కానీ తన వర్గం నేతల ద్వారా ఎస్వీ సీటు దక్కించుకోవాలని ఛూస్తున్నారు. మొత్తానికైతే వైసీపీలో మాజీ తమ్ముళ్ళకు మంచి మంచి అవకాశాలు దొరికేలా ఉన్నాయి.