మంచు విష్ణు “జిన్నా” నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

-

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కధ, స్క్రీన్ ప్లే అందించగా.. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాల్సింది. కానీ అదే రోజు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలు రిలీజ్ అవుతున్న కారణంగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.  టెంట్ హౌస్ కు ఓనర్ గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఏ పని చేయకుండా ఊరంతా అప్పులు చేస్తూ గడుపుతున్న విష్ణు లైఫ్ లోకి సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. అయితే టీజర్ లో సన్నీలియోన్ కు దయ్యంం పట్టినట్లు తెలుస్తోంది.

మరి ఆ దయ్యం నుండి సన్నీలియోన్ ను విష్ణు ఎలా కాపాడాడు? అనేది సినిమా నేపథ్యం అన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ” నా పేరు జన్నారా.. అందరికీ అన్నరా.. నకరాలు చేస్తే కిస్సా కలాస్ రా” అంటూ ఈ పాట సాగుతోంది. పృధ్వి చంద్ర ఆలపించిన ఈ పాటకి అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news