నవీన్ చంద్ర “మంత్ ఆఫ్ మధు” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

-

నటుడు నవీన్ చంద్ర.. పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ యాక్టర్ అయిపోయారు. ఇటీవల విడుదలైన ‘పరంపర’ సీజన్ 2లో ఇరగదీశాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర అని చెప్పొచ్చు. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన తన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హీరోగా చేస్తూనే మధ్య మధ్యలో పలు సినిమాలలో కీలకపాత్రలలో కూడా కనిపించాడు. తాజాగా నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ” మంత్ ఆఫ్ మధు”. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. ” త్రిపుర” చిత్రం తరువాత మరోసారి నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి ఈ సినిమాలో జత కడుతున్నారు.

శ్రియ నవేలి, హర్ష చెముడు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 10:45 గంటలకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news