కరోనా భయం జనాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జలుబు చేసినా తుమ్ము వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా సరే కరోనా అనే భయం తో జనాలు నిద్ర పోవడం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడం అనుమానాలు కూడా బలంగా ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో ఒక వ్యక్తి కరోనా వచ్చింది అనే అనుమానం తో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది.
వాసిరాజు కృష్ణ మూర్తి అనే వ్యక్తికి కరోనా లక్షణాలు కనపడటంతో పరిక్షలు చేయించుకున్నాడు పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అయినా సరే అతనికి ఆయాసం రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పై నుంచి దూకాడు ఆయన. రామంతాపూర్ లో ఈ ఘటన జరిగింది. ఆయనకు మరోసారి కరోనా పరిక్షలు నిర్వహించినా సరే ఆయనకు నెగటివ్ అనే వచ్చింది. అయితే ఆయనకు కంగారులో ఆయాసం వస్తుంది గాని కరోనాతో కాదని చెప్పారు వైద్యులు.