మాములుగా పేడతో ఏం చేస్తారు పిడకలు మాత్రమే చేస్తారు.లేదా ఎరువుగా ఉపయోగిస్తారు..ఇప్పుడు పేడను ఉపయోగించి కలపను,ఇటుకలను తయారు చేస్తున్నారట.. ఎప్పుడైనా చుసారా..అలా చేస్తారని విన్నారా.. కానీ ఇప్పుడు అలాంటి ఒక మిషన్ ఉంది. అది పేడను కలప, ఇటుకలుగా మారుస్తుంది..వావ్ ఈ ఆలోచన చాలా బాగుంది కదూ..అసలు ఆ మిషన్ ఎలా తయారు చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆవు పేడతో పిడకల తయారీ మాత్రమే కాదు అగరబత్తీలు, సంచులు, ఫ్రేమ్‌లు, కార్డ్బోర్డ్, అలంకరణ వస్తువులు మొదలైన వాటితో సహా 100కు మించిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.ఈ పేడతో కలప, ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు. ఆవు పేడతో కలప, ఇటుకలను తయారు చేసే గోకాస్ట్ మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.ప్రభుత్వం చొరవతో ఇలా చేయడం నిజంగా గ్రేట్ ఐడియా.. కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ గురించి అందరికి తెలియజేస్తుంది. ఈ నెల 6న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రాజెక్ట్ ఎర్త్ కింద ఐఐటీ ఢిల్లీ విద్యార్థులకు ఈ యంత్రాన్ని అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “గో కాష్ట్ అభియాన్” మించి ఫలితాలనిస్తోంది. ఈ ప్రచారంలో ఆవు పేడతో కలప ఇటుకల తయారీకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇది రైతులు, మహిళలు, గోశాలలు నడుపుతున్న ప్రజల జీవితాల్లో అనేక మార్పులను తీసుకురానుంది. గోకాస్ట్ యంత్రం ద్వారా పాడి రైతులు కలపతో పాటు ఇటుకలు తయారుచేయవచ్చు.3క్వింటాల పేడతో 1500 కేజీల కలపను తయారు చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు..ఈ కలపను అనేక రకాలుగా వాడుకోవచ్చును అని అధికారులు చెబుతున్నారు.. పాడి,పశువులు ఉన్న రైతులకు అదనపు ఆదాయాన్ని ఇస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.