Bigg Boss 5 Telugu: తెలుగు పరిశ్రమలో వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలోకెక్కె నటి మాధవీలత ఈ సారి బిగ్ బాస్ షోను టార్గెట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో వార్ చేసింది. బిగ్ బాస్ షో అనేది అనాగరికమనీ, ఈ షో ద్వారా ప్రేక్షకులను మానసిక అత్యాచారానికి గురి చేస్తున్నారని మండిపడింది మాధవీలత. ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునని సైతం వీడిచిపెట్టలేదు. హోస్టింగ్ మానేసి.. సినిమాలు సక్కగా చేసుకోమనీ, అదే గౌరవ ప్రదమని సలహాలు ఇచ్చింది.
ఇక తాజా సీజన్లో అత్యంత ప్రజాధారణ ఉన్న కంటెస్టెంట్ ఒక్కరు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబర్ కావడంతో ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో షన్ను ఫ్యాన్ ఇతరులను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిపై తనదైన రీతిలో మాధవీలత ఫైర్ అయ్యింది.
షణ్ముఖ్ ఫ్యాన్స్‌ని సైకోలంటూ మండి పడింది. బిగ్ బాస్ ఉమాదేవిపై అసభ్యకర కామెంట్స్ చేయడం సరి కాదనీ.. మేం సోఫా స్టార్ ఫ్యాన్స్.. మా జోలికి వస్తే రేప్ చేస్తాం.. అంటూ ఉమాదేవిపై కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదేం కల్చర్రా ..? మీరెక్కడి ఫ్యాన్స్‌రా..? మీరే ఇలా ఉంటే..! మీ స్టార్ ఎలా ఉంటాడో అర్థం అవుతుంది. మీ చిల్లరా వేషాలు ఆపండిర్రా .. ఆడవాళ్లపై నోటికొచ్చినట్టు మాట్లాడతారా..? అంటూ ఉతికి ఆరేసింది.
చిల్లర వెధవల్లారా..? మీ పుట్టుక ఏంటి.. ? ఒక్కడికే పుట్టారా..? వందమందికి పుట్టారా..? అలా పుట్టినోళ్లే ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేశారని విరుచకపడింది. బిగ్ బాస్ కు సపోర్టు చేస్తున్న సీని ప్రముఖుల మీద కూడా కామెంట్ చేసింది. ఫ్యాన్స్ అనేవాళ్లు మీరు అభిమానించేవాళ్ల గౌరవం పెంచేలా ప్రవర్తించాలి. ఇలాంటి నీచమైన పదజాలాన్ని బట్టే.. మీ యాక్టర్ ఎంత నీఛమైన వాడో తెలుస్తుంది. ఆడవాళ్ల జోలికి వస్తే.. వదిలే ప్రసక్తి లేదంటూ తనదైన రేంజ్లో మండిపడింది.
ఇదిలా ఉంటే.. మాధవీలత వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు మండిపాడుతున్నారు. ఆడవాళ్లపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం క్షమించరాని నేరమే. కానీ, వారిలాగానే మాధవీలత మాట్లాడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.