కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు మధు యాష్కీకి లేదని అన్నారు. మధు యాష్కీ ఒక పొలిటికల్ టూరిస్ట్ అంటూ విమర్శించాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎం జరుగుతుందో.. కూడా మధు యాష్కీకి తెలవదని ఎద్దేశ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి.. బీజేపీతో కుమ్మక్కు అయ్యావని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐరెన్ లెగ్ గా పేరు ఉంది.. రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ కే అని విమర్శించారు.
మధు యాష్కీ ఎంపీగా ఉన్న సమయంలోనే చెక్కర ఫ్యాక్టరీ ప్రయివేటు పరం అయిందని అన్నారు. అప్పుడు ఎం చేశావని ప్రశ్నించారు. పసుపు బోర్డు కోసం ముఖ్యమంత్రులతో కవిత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇప్పించిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కవిత పాటు పడ్డారని అన్నారు. అలాంటి కవితపై మధు యాష్కీకి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో అరవింద్ కు మధు యాష్కీ మద్దతు తెలిపారని ఆరోపించారు. అప్పుడు బాండ్ పేపర్ రాసిన ఎంపీ అరవింద్ పై ఇప్పుడు ప్రశ్నించాలని మధు యాష్కీకి సవాల్ చేశారు.