మాగంటి విషయంలో చంద్రబాబు ప్రయారిటి మారిందా…!

పశ్చిమ గోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట మొన్నటి ఎన్నికల్లో బీటలు వారింది. ఈ జిల్లా రాజకీయాలు ప్రతి పార్టీకి చాలా ముఖ్యం. ఎందుకుంటే ఇక్కడ సీఎం సీటును ప్రభావితం చేసేంతటి సీట్లు ఓట్లు ఉంటాయి. ఈ జిల్లాలో ఎవరికి మంచి పట్టు ఉంటే వారిదే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ ఓటమిలో పార్టీ వైఫల్యం కొంత అయితే స్థానిక నాయకులు వైపల్యం మరి కొంత. ఏదైతేనేం ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ బాద నుంచి తేరుకుని పార్టీకి కొత్త ఊపు తేవడం కోసం చంద్రబాబు భారీ మార్పులకే శ్రీకారం చుట్టారు.

పార్టీ అద్యక్షుల నుంచి ,పొలిటిబ్యూరో పదవులు, అలాగే పార్లమెంట్ పార్టీ అద్యక్షులను కూడా నియమించారు. ఈ నియామకాలు జరిగి చాలా కాలం అవుతున్నా వారి పర్యవసానాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గతంలో ఏలూరు ఎంపీగా పనిచేసిన మాగంటి బాబు , చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉండేవాడు. పార్టీలో క్రీయాశీలకంగా ఉన్నాడు. అయితే ఎన్నికల్లో పలితాలు ఉల్టా కావడంతో చంద్రబాబు ప్రయారిటీస్ కూడా మారిపోయాయి. కొత్త నాయకత్వం గురించి ఆలోచించిన చంద్రబాబు, మాగంటి బాబును పూర్తిగా పక్కన పెట్టేశారు.

పార్టీ పదవుల్లో ఎలాంటి అవకాశం కల్పించకపోగా, కనీసం తాను ఎంపీగా పనిచేసిన పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అద్యక్షుడిగా కూడా నియమించకపోవడం పట్ల తీవ్ర మస్తాపానికి గురయ్యారంట. చంద్రబాబు తనను ఎందుకు దూరం పెట్టాడో తెలియక సతమతమౌతున్నాడంట. సరే జరిగింది జరిగిపోయిందని భాదలో ఉన్న తనను ఓదార్చడానికి కూడా ఎవరూ రాలేదంట. దీంతో తాను గట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారంట. ఎంపీగా చేసిన వ్యక్తికి పార్టీలో ఏపదవి లేకుండా ఆ పార్టీలో కొనసాగడం కష్టమనే నిర్ణయానికి వచ్చారంట.

అయితే చంద్రబాబు తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయంలో మాగంటి బాబుకు స్పష్టత రాలేదంట. తాను ఓడిపోయాను. తానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గల్లంతైంది. అలాంటప్పుడు ఎందుకు తనను ఇంతలా పక్కన పెట్టారన్న ఆలోచనలో ఉన్నారంట. ఎంపీగా పనిచేసిన తనను కాదని, ఎమ్మెల్యేగా చేసిన గన్ని వీరాజంనేయులును ఏలూరు పార్లమెంట్ పార్టీ అద్యక్షుడిగా నియమించడానికి మాగంటి బాబు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారంట. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాదాన్యత లేకపోయినా పర్వాలేదని తాను వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే పశ్చిమ గోదావరి రాజకీయాల్లో అది ఒక కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది.