త్వరలో మహా పాదయాత్ర.. ప్రకటించిన రేవంత్

Join Our Community
follow manalokam on social media

ప్రభుత్వాన్ని కదిలిద్దాం అనే పాదయాత్ర చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నో మోహమాటలు.. అడ్డంకులు ఉన్నా సభకు వచ్చిన నాయకులకు ధన్యవాదాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.  మోడి.. కేసీఆర్ కి నాలుగు గోడల మధ్య ఏం చూపించారో కానీ కేసీఆర్ కి భయం పట్టుకుందని ఆయన అన్నారు.  కేసీఆర్ ని నువ్వు కొనొచ్చు… కానీ తెలంగాణా ప్రజలను మోసం చేయలెవ్వు మోడీ అని ఆయన చెప్పుకొచ్చారు.

మోడీ నన్ను నువ్వు ఎంపీగా చూస్తున్నవేమో,  నేను ఓ కాపొన్ని… రైతుకు అన్యాయం చేస్తుంటే రైతు బిడ్డగా ఊరుకుంటాన..? అని ప్రశ్నించారు.  ప్రియాంక గాంధీ ఊరు ఊరు తిరుగుతుంటే… నేను సైలెంట్ గా ఉంటే నన్నెవడైన మనిషి అంటారా..? అని ప్రశ్నించిన ఆయన . పాదయాత్ర అడ్డుకోవాలని కొందరు చూశారని అయినా చేశానని అన్నారు.  . తొందరలోనే  తెలంగాణ అంతా పర్యటన చేస్తానాన్న ఆయన ఏఐసీసీ నుండి అనుమతి తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్ సునామీ సృష్టిస్తా… కేసీఆర్ ని సునామిలో ముంచుతానని అన్నారు. అలానే తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...