మహేశ్ బాబుకి ఎర్త్‌ పెడుతోన్న విజయ్ దేవరకొండ

Join Our Community
follow manalokam on social media

మహేశ్‌ బాబుకి ఫీమేల్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ అని చాలామంది అంటారు. కానీ ఇప్పుడా ఫాలోయింగ్‌కి విజయ్‌ దేవరకొండ బ్రేకులేస్తున్నాడు. ప్రిన్స్‌ ఫాలోయింగ్‌ని ఎత్తుకెళ్లిపోతున్నాడు రౌడీ స్టార్. అంటే ప్రిన్స్‌కి విజయ్ దేవరకొండ కాంపిటీటర్‌గా మారుతున్నాడా.. అసలు విజయ్‌, మహేశ్‌ని రీప్లేస్ చెయ్యగలడా…


మహేశ్‌ బాబు టాలీవుడ్‌ టాప్ చైర్‌ కోసం పోటీ పడుతున్నాడు. నంబర్‌ గేమ్‌లో టాప్‌-2లో ఉన్నాడు. ఇలాంటి హీరోకి విజయ్ దేవరకొండ పోటీగా వస్తున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. మహేశ్ ఫాలోయింగ్‌ని డివైడ్‌ చేసుకుంటూ పోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో చాలామంది విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ క్లబ్‌లో చేరుతున్నారనే టాక్ వస్తోంది.
మహేశ్ బాబు మిల్క్‌ బాయ్ లుక్స్‌కి ఫీమేల్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ప్రిన్స్‌ సినిమా రిలీజ్‌ అంటే థియేటర్ల దగ్గర అమ్మాయిల హడావిడి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ హీరోకి పోటీగా విజయ్ దేవరకొండ కూడా ఫీమేల్‌ ఆడియన్స్‌ని పెంచుకుంటున్నాడటనే టాక్ వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్‌లో విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ చూసి, ఈ రౌడీ స్టార్‌ మహేశ్‌ ఫాలోయింగ్‌ని ఎత్తుకెళ్తున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి.

సారా అలీఖాన్ రీసెంట్‌గానే ఫ్యాన్‌ మూమెంట్‌ అని విజయ్‌ దేవరకొండతో ఫోటీ దిగి పోస్ట్ చేసింది. అంతకుముందు కియారా అద్వానీ పబ్లిక్‌గానే విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పింది. ఇక బోల్డ్‌ లవర్‌ ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్‌కి చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్‌ అయ్యారు. ఇప్పుడు కాలేజీ అమ్మాయిల్లో చాలామంది విజయ్‌ ఫ్యాన్‌ క్లబ్‌లో జాయిన్‌ అవుతున్నారని చెప్తున్నారు.

విజయ్ దేవరకొండ రాకముందు అమ్మాయిల్లో చాలామంది మహేశ్ ఫ్యాన్‌ క్లబ్‌లో చేరేవారు. అయితే ‘అర్జున్ రెడ్డి’ వచ్చాక సీన్‌ మారుతోంది. ఈ ఫాలోయింగ్ డివైడ్ అవుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్లు కూడా అర్జున్‌ రెడ్డి పెర్ఫామెన్స్‌కి పడిపోయారంటే, బయట కూడా లేడీ ఫాలోయింగ్‌ ఇదే రేంజ్‌లో ఉండొచ్చని చెప్తున్నారు. 

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...