ఆసుపత్రికి వస్తే… ప్రాణాలు పోయేంత పనైంది.

-

సాధారణంగా ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వెళ్తాం, అయితే వెళ్లిన చోట ప్రమాదాలు నెలకొంటే ఎలా ఉంటుంది. అచ్చం అలాగే ఉంది కొన్ని ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి. నిర్మాణ లోపాలు, కాంట్రాక్టర్ల చేతివాటం, అధికారుల అలసత్వం కలిస్తే రోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి అలసత్వమే మహబూబాబాద్ జిల్లా ఏరియాసుపత్రిలో చోటు చేసుకుంది. భవన నిర్మాణ లోపాలతో సీలింగ్ ఊడిపోయింది. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారికి చికిత్స అందించే ఐసీయూలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

సోమవారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండీ సీలింగ్ ఊడి కొంత మంది పేషంట్లపై పడ్డాయి. మరోవైపు బయట ఉరుములు మెరుపులతో కూడాన వర్షం కురుస్తుండటంతో రోగులకు, సిబ్బందికి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.  సీలింగ్ ఊడిపోవడంతో స్లాబ్ నుంచి వర్షపు నీరు కూడా ఐసీయూలోకి చేరింది. చిమ్మచీకట్లలోనే ఉరుములు, మెరుపుల మధ్య బెడ్లపై ఉన్న రోగులను తోసుకుంటూ మరోక వార్డుకు తరలించాల్సి వచ్చింది. రాత్రి నుంచి హాస్పిటల్లోనే ఉండి డాక్టర్లు శ్రమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news