“మా” నామినేషన్ల స్వీకరణ నేటినుండే.. ప్యానెల్ సభ్యులతో ఆ ఇద్దరు రెడీ..

-

తెలుగు సినిమా నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సిద్ధం అవుతుంది. మా ఎన్నికలంటేఎప్పుడూ ఉండే ఆసక్తి ఇప్పుడు కూడా ఉంది. విమర్శలు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలైనవన్నీ ఇప్పటివరకూ జరిగాయి. ప్రస్తుతం, మా లో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ప్యానెల్ సభ్యులతో కలిసి అధ్యక్ష బరిలోకి దిగే వాళ్ళు నామినేషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సర్వం సిద్ధం చేసుకున్నారు.

ఈరోజు ఉదయం 11గంటలకు ప్రకాష్ రాజ్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. అలాగే అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు, తన ప్యానెల్ సభ్యులతో మద్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఇంకా సీవీఎల్ నరసింహారావు 11గంటల ప్రాంతంలో ఫిలిమ్ నగర్లోని మా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సుమారు వెయ్యి మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news