ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలలు ఈరోజు తెరుచుకోవట్లేదు. రైతులు నిర్వహిస్తున్న భారత్ బంద్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండనున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు బంద్ ప్రకటించింది. ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు ఉపాధ్యాయుల సంఘం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు బంద్ నిర్వహించాలని ఉపాధ్యాయుల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది.
ఉపాధ్యాయుల సంఘం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈరోజు తరగతులకు మరొక రోజు ప్రత్యామ్నాయ క్లాసులు నిర్వహిస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో పీజీఈసెట్ పరీక్ష వాయిదా పడింది. భారత్ బంద్ కారణంగా ఈ రోజు పరీక్ష వాయిదా వేసారు. రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.