మహానటి సావిత్రి ఓ ఐటెం సాంగ్ లో నటించిన తెలుసా.. !

-

మహానటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మొదటి తరం నటిమని సావిత్రి.. సావిత్రి అంటేనే నిండైన చీర కట్టులో హుందాగా ఉండే రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో నటిస్తూ చిరస్థాయిగా ప్రేక్షకులు మదిలో నిడిచిపోయిన సావిత్రి తన కెరీర్ ఆరంభంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది అనే విషయం ఎవరికీ తెలియదు..

సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో సరి సమానంగా నటించిన సావిత్రి తమిళంలో స్టార్ హీరోలైన శివాజీ గణేషన్, ఎంజీఆర్ , జెమినీ గణేషన్ వంటి హీరోలతో పాటు తెలుగులో ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి హీరోల సరసన నటించి భారీ పాపులారిటీని దక్కించుకుంది. అయితే తన కెరియర్ ఆరంభంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చి వెంటనే అది చేయి జారిపోవడంతో సావిత్రిలో ఎలాగైనా నటిగా గుర్తింపు పొందాలని కసి పెరిగింది..

ఆ తర్వత కొన్ని రోజులపాటు ఒంటరిగా ఏడుస్తూ కూర్చొన్న సావిత్రి… తానేమిటో నిరూపించుకోవాలనే తపన ఆమెలో మొదలైంది. అద్దం ముందు గంటల తరబడి కూర్చొని చలాకీగా డైలాగులు చెప్పడం .. భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది. అలా కొన్నాళ్ల తర్వాత 1951లో పాతాళ భైరవి సినిమాలో ఒక నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్లి అక్కడ దర్శకుడైన కేవీ రెడ్డి గారిని కలుసుకుంది. అయితే ఇప్పటి ధోరణి లో చెప్పాలి అంటే ఆ పాట ఒక ఐటమ్ సాంగ్.. “నేను రాను అంటే రాను” అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికయింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఆ పాటతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఎన్నో చిత్రాల నటించే అవకాశం వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే లాగా చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news