Breaking : ఢిల్లీకి చేరిన కేసీఆర్‌.. డ్రెస్సింగ్‌ స్టైల్‌ అదుర్స్‌..

-

సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 14వ తేదీన బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లారు. అంతకు ముందు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేసీఆర్​కు బీఆర్​ఎస్​ ఎంపీలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14న బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అదే రోజు బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

Thumbnail image

హస్తినలోని సర్దార్ పటేల్‌మార్గ్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా కేసీఆర్​ అదే రోజు యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్‌ వంటి వాటిని పరిశీలించారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో స్వాగతం పలికిన అందరి దృష్టి సీఎం కేసీఆర్‌ పైనే ఉంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ఎప్పుడూ చూసిన కేసీఆర్‌ వైట్‌ అండ్‌ వైట్‌లోనే కనిపించారు. కానీ ఇప్పుడు సూట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే.. సీఎం కాకముందు ఆయన ఇలాంటి డ్రెస్‌లు వేసినట్లు తెలుసా..కానీ.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో.. డ్రెస్సింగ్‌ స్టైల్‌ కేసీఆర్‌ మార్చారనే చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news