దేశం లోనే అత్యధిక కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది మాహారాష్ట్ర..! అక్కడి ప్రభుత్వం తలకిందుల తపస్సు చేసినా కరోనా ను నియంత్రించలేకపోతుంది. ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని కట్టుబాటు చర్యలు చేస్తున్నా కరోనా మహమ్మారి తాకిడి నుండి రక్షించుకోలేకపోతుంది. దేశం లోనే అత్యధికంగా 1.65 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి 7500 కు చేరువలో మృతుల సంఖ్య నమోదయ్యింది. అధికారులు రోగులను కాపాడలేక తలలు పట్టుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం చేసేది ఏమి లేక మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది. వచ్చే నెల జులై 31 దాకా లాక్ డౌన్ ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి ప్రజలను అక్కడే ఉండమని హెచ్చరించింది. దీంతో ముంబై నగరపు వీధుల్లో ట్రాఫిక్ జామ్ తారా స్థాయికి చేరిపోయింది. అనవసరంగా లేని పోనీ కారణాలు చెప్పి ఎవ్వరూ బయటకు రాకూడదని హెచ్చరించింది. మాల్స్ కు కాంప్లెక్సులకు అనుమతి లేదు. కేవలం నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారులకు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరుచుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ కార్యాలయాలకు కేవలం 10 నుండి 15 మంది మాత్రమే హాజరవ్వాలి కేవలం వారితోనే పనులు చేయించుకోవాలని ఆదేశాలి జారీ చేసింది. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటించింది. సోషల్ డిస్టెన్సింగ్ మాస్కుల ఉపయోగం తప్పనిసరి.
లాక్ డౌన్ : జులై 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిన మహారాష్ట్ర..!
-