లడఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యం భారతదేశానికి చెందిన 20 మంది సైనికుల్ని చంపిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యాంటీ చైనా అభిప్రాయం దేశమంతా పెరుగుతోంది. చైనా వస్తువుల్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు రక్షణ, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆ యాప్స్ ను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.