ఛీ.. ఛీ..కన్న కూతురు పై అత్యాచారం చేసిన కామాంధుడు..దారుణం..

సమాజంలో రోజు రోజుకు దారుణాలు పెరుగుతున్నాయి… మనుషులు రాక్షసులుగా మారుతున్నారు.. కామాంధుల కోరికలకు అడ్డు ఆపు లేదు.. ముఖ్యంగా చెప్పాలంటే వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.. ఐదు నిమిషాల సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలంగాణ నగరాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.. సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. కళ్లు మూసుకుపోయి అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. కన్న పేగును పంచిన కన్న తండ్రి కూతురు పై కామంతో రెచ్చిపోయాడు..అంతేకాదు పలుమార్లు ఆమె పై అత్యాచారం చేసాడు..

కూతురు ఆ భాధలు భరించలేక చనిపోవాలని అనుకుంది.. ఓ రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న కూతురును తల్లి గమనించి నిలదీసింది.. దాంతో తండ్రి తన పై చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.. నాగ్‌పూర్, సావోనర్ ప్రాంతంలో చోటు చేసుకుంది..స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఆ కీచకుడు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన లాయర్ కీచకుడిగా మారాడు. పదో తరగతి చదువుతున్న కన్నకూతురిపై నీచానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి నిత్యం అత్యాచారం చేస్తున్నాడు. తండ్రి నీచమైన పని భరించలేకపోయిన కూతురు ఆత్మహత్యాయత్నం చేసింది.

అది గమంచిన తల్లి కూతురిని గట్టిగా నిలదీసి అడిగింది. దాంతో అమ్మాయి భయంతో వణికిపోతూ తండ్రి చేస్తున్న నిర్వహం మొత్తం తల్లితో చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది.కూతురిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న విషయం తెలిసి తల్లడిల్లిన తల్లి వెంటనే సమీప పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వల్ల కూతురుకు హాని కలుగుతుందని భావించి, జరిగిన విషయాలను పోలీసులకు చెప్పింది..బాధితురాలు తల్లి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. తన నీచానికి తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కోరింది.. ఆమె చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు..