మహేష్ బాబు, రాజమౌళి సినిమా మరో రేంజ్ లో.!

-

రాజమౌళి  RRR సంచలనాలకు లెక్క లేకుండా పోయింది. అన్ని వరస బెట్టి ఒకే సారి వస్తున్నాయి. ఆయన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారిచే ఉత్తమ దర్శకుడి గా ఎంపిక అయ్యారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నాటు నాటు సాంగ్ కు వచ్చింది. ఈ సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో దూసుకు పోతుంది.ఈ అవార్డ్ వచ్చిన వారు ఆస్కార్ అవార్డు కు దగ్గరగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దానితో పాటు జపాన్ అవార్డు కూడా లభించింది.

రాజ మౌళి కూడా నాకు దబ్బు అవసరం లేదు, నేను డబ్బు కోసం సినిమా తీయడం లేదని కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడారు.ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక రాజమౌళి ప్రతి సినిమాకు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉంటారు. కథ మొత్తం తయారు అయిన తరువాత మళ్లీ ఇద్దరూ కలసి కూర్చొని తుది మెరుగులు దిద్దు కుంటారు

ప్రస్తుతం మహేశ్ బాబు కథ మీద విజయేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీ గా ఉన్నారు. రాజ మౌళి RRR ఆస్కార్ అవార్డు గురించి అమెరికాలోనే ఎక్కువుగా గడుపుతున్నారు. మహేష్ బాబు సినిమా ను ఈ పాన్ వరల్డ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ కు తగ్గకుండా చూపించాలని రాజమౌళి మైండ్ లో ఆలోచన తో ఉన్నాడు. దీని కోసం పెద్ద మొత్తం లో డబ్బు పెట్టే సంస్థలు కూడా టచ్ లో ఉన్నాయట.ఇక మహేష్ కూడా రాజమౌళి ఏది అడిగినా చేయడానికి రెడీగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news