IRCTC కాశ్మీర్ టూర్ ప్యాకేజీ… పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే IRCTC కాశ్మీర్ టూర్ ప్యాకేజీ ని చూడండి. IRCTC ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తూనే వుంది. ఈ ప్యాకేజీల ద్వారా మీరు మీకు నచ్చిన టూర్ వేసేయచ్చు. జమ్మూ కశ్మీర్ చాలా బాగుంటుంది. ప్ర‌కృతి ప్రేమికులకు, నూతన జంటలకు ఇది చాలా నచ్చుతుంది. ఇక IRCTC కాశ్మీర్ టూర్ ప్యాకేజీ వివరాలని చూసేద్దాం.

కాశ్మీర్‌ను సందర్శించాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇది బాగుంటుంది. సరసమైన ధరకే కాశ్మీర్ వెళ్లవచ్చు. ముంబై నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణించే విమాన ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీ ద్వారా ఏప్రిల్ మరియు మేలో కాశ్మీర్‌ను చూసి వచ్చేయచ్చు. ఇది 6 రోజులు, 5 రాత్రులు ప్యాకేజీ. ఈ ప్యాకేజీ ద్వారా మీరు గుల్‌మార్గ్, జమ్మూ, కట్రా, శ్రీనగర్, పహల్‌గామ్, సోన్‌మార్గ్ వంటి ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు.

అల్పాహారం మరియు రాత్రి భోజన సౌకర్యం కూడా ఈ ప్యాకేజీ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. సోలో ట్రావెల్‌కు ఒక్కొక్కరికి రూ.59,800. ఇద్దరు వ్యక్తులకు రూ.43,300. అదే ముగ్గురు కి రూ.42,000 చెల్లించాలి. 11 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేకంగా వసూలు చేస్తారు. పూర్తి వివరాలని IRCTC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చూడచ్చు. అలానే బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news