VIRAL : ‘కళావతి’ పాటకు మహేశ్‌ బాబు కూతురు సితార స్టెప్పులు

-

ప్రిన్స్‌ మహేష్‌ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఓ వీడియో పెడుతూ… అందరినీ అలరిస్తుంది సితార. యూట్యూబ్‌ వీడియోస్‌ తో సొంత ఇమేజ్‌ ను తెచ్చుకుంది ఈ చిన్నారి. ఇప్పుడు సరికొత్త డాన్స్‌ వీడియోతో ఆడియెన్స్‌ ను మెస్మరైజ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియా క్వీన్‌ గా మారిపోయింది సూపర్‌ స్టార్‌ డాటర్‌ సితార.

చిన్న తనం నుంచే ఇన్‌ స్టా వీడియోస్‌ తో.. డాన్స్‌ వీడియోస్‌ తో హడావిడి చేస్తూ వచ్చిన సితార.. ఇప్పుడు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఓపెన్‌ చేసింది. సొంతంగా ఇన్‌ స్టా అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేసి.. తన అభిప్రాయాలు ఎప్పుటి కప్పుడు పంచుకుంటుంది.

అయితే.. తాజాగా సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదల అయినటు వంటి.. కళావతి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది సితార. అచ్చం వాళ్ల తండ్రి మహేష్‌ బాబు వేసినట్లే అదే స్పెప్పులు వేసి.. అందరి మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news