అభిమానులకు కన్నుల పండుగే..ఒకే ఫ్రేమ్‌లో మహేశ్ బాబు, రామ్ చరణ్

-

టాలీవుడ్ లో ప్రజెంట్ హీరోల మధ్య హెల్దీ అట్మాస్పియర్ ఉంది. RRR సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు తారక్, రామ్ చరణ్ కలిసి నటించి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రంతో మల్టీస్టారర్ ట్రెండుకు కూడా అడుగులు పడ్డాయి. ఈ ట్రెండును కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి.

ఈ సంగతులు పక్కనబెడితే.. రామ్ చరణ్ – మహేశ్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అభిమానులకు కన్నుల పండుగే కదా..అవునండీ వీరిరువురు కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అయితే, హీరోలిద్దరూ తమ భార్యలతో వచ్చారు. మహేశ్ బాబు – నమ్రత, రామ్ చరణ్ – ఉపాసన ఒకే ఫ్రేమ్ లో దిగిన ఫొటో ప్రస్తుతం ట్రెండవుతున్నదని చెప్పొచ్చు.

ఈ ఫొటో చూసిన అభిమానులు మహేశ్- చరణ్ కాంబోలో సినిమా రావాలని కోరుతున్నారు. సూపర్ స్టార్ , మెగా పవర్ స్టార్ సూపర్ …అని కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ వచ్చే నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మహేశ్ కు జోడీగా మహానటి కీర్తి సురేశ్ నటించింది.

రామ్ చరణ్ తన తండ్రి చిరుతో కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ పిక్చర్ నుంచి ఇప్పటికే ‘లాహే లాహే, నీలాంబరి, చానా కష్టం వచ్చేసిందే’ సాంగ్స్ రిలీజ్ కాగా, ఈ నెల 18న ‘భలె బంజారా, బంజారా’ సాంగ్ విడుదల కానుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి డ్యాన్స్ స్టెప్పులేశారు.

https://www.instagram.com/p/CccLYyOqk3c/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news