అన్నం తిన్నాక రోజూ వీటిని తింటే సమస్యలే వుండవు..!

-

ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే అనారోగ్య సమస్యలు రావు. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం అనుసరించే జీవన విధానాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మీరు కూడా మీ ఆరోగ్యంని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ప్రతి రోజూ భోజనం తర్వాత దీన్ని తీసుకోండి. దీంతో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎన్నో ఔషధాలు తయారీలో ఉపయోగించే ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

 

దానిమ్మ కంటే ఇందులో 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మీరు ఉసిరిని ఎండబెట్టి రోజు రెండు ముక్కలు భోజనం తర్వాత తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలానే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉసిరి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది.

నోటి పూత వంటి సమస్యల నుండి కూడా బయట పడొచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఆర్థరైటిస్ సంబంధిత నొప్పితో బాధపడే వాళ్లు దీనిని తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడడానికి కూడా అవుతుంది. ఉసిరి, తేనె కలిపి తీసుకోవడం వల్ల కఫ దోషాలను తొలగించుకోవచ్చు. జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి రోజు భోజనం తిన్న తర్వాత ఉసిరిని తీసుకుంటే ఇన్ని లాభాలను పొందవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news