కరోనాపై మహేష్ పోస్ట్.. ఇది చేయండి..!

కరోనా మహమ్మారి భారత్‌ను తాకినప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదో ఒక రూపంలో హెచ్చరికలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా  దేశంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లాక్‌ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. మనల్ని, చుట్టు పక్కల ప్రజలను మనం రక్షించుకునే సమయం ఇది. బయటికి వచ్చేటప్పుడు ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలని కోరారు.

అందరు భౌతికదూరం పాటించాలని సూచించారు. అలాగే ఇప్పటివరకు మీ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ లేకపోతే ఇకనైనా డౌన్ లోడ్ చేసుకోవాలని.. ఇది సానుకూల కేసులను ట్రాక్‌ చేయడంలో మీకు సాయపడుతుంది. అందరు సురక్షితంగా ఉండండి. కరోనా గురించి తెలుసుకోండి. మరింత భద్రతగా మెలగవలసిన సమయమిదని ఇన్‌స్టాగ్రామ్ మహేష్ బాబు పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.