మహేష్ నీ సినిమా పైరసీ చేస్తే ఊరుకుంటావా…?

-

నీ జిల్లాలో నీ గ్రామానికి 50 కిలోమీటర్లు కూడా లేని ప్రాంతంలో రైతులు తమ బతుకు కోసం పోరాటం చేస్తున్నారు కదా…? ఎందుకు నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు…? నీ సినిమా డబ్బులు రాకపోతే నువ్వు ఊరుకుంటావా…? నీతో సినిమా అని దర్శకుడు ఇంకో హీరోతో సినిమా చేస్తే నువ్వు ఊరుకుంటావా…? అమరావతి ప్రాంతం కోసం నీ బావ కూడా పోరాడుతున్నాడు కదా…? నీ జిల్లా కదా…?

ఎందుకు నీకు కనీసం జాలి దయా ఉండదు…? ఎవడికి ఉపయోగం సామి నువ్వు…? శ్రీమంతుడు సినిమాలకు మాత్రమే మానవత్వం లేని మనిషి నువ్వు…! బతికి ఉండగా నీ సినిమా కూడా చూడను నేను…! కనీసం నీ సినిమాలో పాట కూడా వినను…! నీ సినిమా పైరసీ అయితే ఊరుకుంటావా…?” అంటూ సిని హీరో మహేష్ బాబుని లక్ష్యంగా చేసుకుని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

నీ అభిమాని అయినందుకు సిగ్గుతో తల దించుకుంటున్న అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి అధ్వర్యంలో హైదరాబాద్‌లోని మహేష్ బాబు ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఇవాళ్టి నుంచీ ఈనెల 19 వరకూ సినిమా నటుల ఇళ్ల ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే

Read more RELATED
Recommended to you

Latest news