తలసాని అంటే బోనాలు.. బోనాలు అంటే తలసాని అయ్యింది – తెలంగాణ హోం మంత్రి

-

తలసాని అంటే బోనాలు.. బోనాలు అంటే తలసాని అయ్యిందని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ ఆలీ అన్నారు. తెలంగాణ ప్రజలందరికి బోనాల శుభాకాంక్షలు చెప్పారు. దగ్గరుండి తలసాని ఏర్పాట్లను చూసుకుంటున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ ఆలీ.

నిజాం కూడా బోనాలను నిర్వహించారు.. గంగా యమునా తహజీబ్ సంస్కృతి మనదని చెప్పారు. బోనాలని అధికార పండగగా నిర్వహిస్తున్నాం..ఎటువంటి లోటు లేకుండా ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.. గోదావరి ఉప్పొంగుతుంది.. అమ్మవారి దయవల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయనిచెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దేవాలయాలని సర్వాంగసుందరంగా తీర్చి దిద్దుతున్నాం.. శాంతి భద్రతల లోపం లేకుండా శాంతియుతంగా పండగలు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news