Bimbisara:”ఓ తేనె పలుకుల” సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్

-

నందమూరి కళ్యాణ్‌ రామ్.. మంచి మాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. హీరోగానే కాకుండా… ఓ నిర్మాతగా బాగా సక్సెస్‌ అయ్యారు కళ్యాణ్‌ రామ్‌. అయితే… ప్రస్తుతం టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ”బింబిసార” అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా.

ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే. ఈ సినిమా విడుదల తేదీని ఉగాది కానుకగా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ మూవీని ఆగస్టు 5వ తేదీన వరల్డ్‌ వైడ్‌ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.తాజాగా ఈ చిత్రం నుండి “ఓ తేనె పలుకుల” అనే డ్యూయెట్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పాటలో అందాల భామ కేథరిన్ తేజ్రాతో కళ్యాణ్ రామ్ చేసిన రొమాన్స్ అద్భుతంగా ఉండగా.. విజువల్ పరంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news