Acharya: ట్రైలర్‌లో కాజల్‌కు నో చాన్స్..కావాలనే అలా చేసిన ‘ఆచార్య’ మేకర్స్!

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’ ట్రైలర్ లో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఆచార్య’ ఫిల్మ్ స్టోరిలో కాజల్ అగర్వాల్ పాత్రకు ప్రయారిటీ లేదా ? అనే క్వశ్చన్ రేజ్ చేశారు. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..ఆచార్య మేకర్స్ కావాలనే కాజల్ పాత్రను సస్పెన్స్ లో పెట్టారట.

‘ఆచార్య’ స్టోరిలో భాగంగా సినిమాలో డైరెక్ట్ గానే కాజల్ అగర్వాల్ పాత్రను పరిచయం చేయాలని ప్లాన్ చేసినట్లు టాక్. కొరటాల శివ సినిమల్లో కథా నాయికల పాత్రలకు ప్రాధాన్యత ఉండే సంగతి అందరికీ విదితమే. ఆయన గత చిత్రాల్లో కథానాయికల పాత్రలే స్టోరిని మలుపు తిప్పుతుంటాయి. ఇందులో కూడా అలానే ఉంటుందని టాక్. అయితే, ఈ సినిమా స్టోరి ట్రీట్ మెంట్ కొంచెం కొత్తగా చేశారట ‘ఆచార్య’ దర్శకులు.

ఇద్దరు సూపర్ స్టార్స్ ను ఎలివేట్ చేసే క్రమంలో ఫ్యాన్స్ ను సాటిస్ ఫై చేయడంతో పాటు స్టోరి పైన ఫుల్ ఫోకస్ పెట్టి, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా జాగ్రత్త పడినట్లు తాజా ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పుకొచ్చారు.

ఈ నెల 29న చిత్రం విడుదల కానుండగా, 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news