పురుషుల్లో కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉంటాయి. యూఎస్ లో ప్రతీ ఎనిమిది మంది జంటల్లో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్య కి గురవుతున్నారు. ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఎవరైనా బాధ పడుతుంటే డాక్టర్స్ స్పెరమ్ కౌంట్ ని చెక్ చేయడం, ఒక మిల్లీ లీటరు సెమెన్ లో ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి ఇటువంటి వాటిని టెస్ట్ చేస్తూ ఉంటారు వైద్యులు. కెమికల్స్ వలన పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు….
అయితే 1990 నుంచి చూసుకుంటే చాలా రకాల కారణాలు పురుషుల్లో ఫర్టిలిటీ సమస్యలని తీసుకు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు దీనిపై చాలా రీసెర్చ్ జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం పర్యావరణంలో ఉండే హానికరమైన కెమికల్స్ వంటి వాటి వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు వస్తున్నట్లు గుర్తిస్తున్నారు.
ముఖ్యంగా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, హెవీ మెటల్స్, టాక్సిన్స్ వంటి వాటి వల్ల వాటి సమస్యలు వస్తున్నాయి. అలానే ప్లాస్టిసైజర్స్ వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఇది ప్లాస్టిక్ లో ఉంటుంది వాటర్ బాటిల్స్, ఫుడ్ కంటైనర్లు లో ఇది ఎక్కువగా ఉంటుంది.
అలానే ఫాస్పరస్ వల్ల కూడా ఇది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. పట్టణాలలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది దీని వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు ఇతర కాంపౌండ్స్ వల్ల కూడా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. లాప్ టాప్, సెల్ ఫోన్స్, మోడెమ్స్ వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. దీని కారణంగా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ కెమికల్స్ ని ట్రాకింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనకి 80 వేల పైగా కెమికల్స్ ఉంటాయి.