మల్లన్న వెరైటీ పాలిటిక్స్: అంత అవసరమా..?

-

తెలంగాణలో బీజేపీ పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా ఆ పార్టీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. అయితే ఇలాంటి పరిస్తితుల్లో బీజేపీ ఇంకా జాగ్రత్తగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దూకుడుగా ఉండటంతో పాటు, ఆ దూకుడులో తప్పులు రాకుండా చూసుకోవాలి. అప్పుడే పార్టీకి మైలేజ్ వస్తుంది. అయితే ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఊహించని విధంగా టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టబోయి, బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టినట్లు కనిపిస్తోంది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

మల్లన్నకు తెలంగాణ రాజకీయాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. అలాంటి నేత ఎలాంటి విమర్శలు చేసిన ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అందుకే జాగ్రత్తగా రాజకీయం చేయాల్సి ఉంటుంది…కానీ మల్లన్న ఊహించని విధంగా కేసీఆర్ మనవడు హిమాన్షుని రాజకీయాల్లోకి లాగారు. తాజాగా సోషల్ మీడియాలో మల్లన్న ఒక పోస్ట్ పెట్టారు. అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా ఒక పోల్ పెట్టారు.

ఇక ఇక్కడే రచ్చ మొదలైంది..దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తన కుమారుడు ఆకారంపై మాట్లాడటంపై కేటీఆర్, బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు మీరు నేర్పిస్తుంది ఇదేనా అంటూ జేపీ నడ్డాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవే మాటలు మోడీ కుటుంబాన్ని, అమిత్ షా కుటుంబాన్ని తాము విమర్శించ లేమా? అని నిలదీశారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, మల్లన్నపై దాడి చేశారు.

అయితే ప్రభుత్వంలో ఎలాంటి అధికారాలు లేని హిమాన్షుకు పెత్తనం ఇస్తున్నారని, భద్రాచలం ఆలయానికి ప్రభుత్వ అతిథి హోదాలో ఎలా వెళ్తారని ఉద్దేశంతో మల్లన్న ఆ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా శరీర ఆకారంపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదనే వాదనలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మల్లన్న వేరే విధంగా చెప్పి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news