గుప్పెడంతమనసు ఎపిసోడ్ 330: లోపల బాధపడతూ..పైకీ నటిస్తూ కొడుకు చెప్పిన పని చేస్తున్న జగతి..కాఫీ మొదలు లంచ్ వరకూ అన్నీ సపరేటే

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో..జగతి.. నేనొకటి చెబుతాను చేస్తావా అంటుంది. మీరు నాకు మార్గదర్శకులు, నా భవిష్యత్ కి కొత్త దారి చూపించారు, మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, మీరే నాకు స్ఫూర్తి మేడమ్, ఏ బంధం-బంధుత్వం లేకుండా నన్ను ఆదరిస్తున్నారని చెప్పు అంటుంది. జగతి మనసులో.. రిషి చెప్పిన పని గురించి ఆలోచిస్తే నాకు ఏం చేయాలో అర్థంకావడం లేదు..నీతోనే నీ మొహం మీదే నా ఇంట్లోంచి వెళ్లిపో అని ఎలా చెప్పగలను అనుకుంటుంది. అమ్మను బాధపెట్టింది సరిపోలేదా, కొత్తగా ఈ పని అప్పగించావ్ అని బాధపడుతుంది. వసూ.. మేడం ఏదైనా ప్రాబ్లెమా, దేవయానీగారు మళ్లీ ఏమైనా వచ్చారా అని అడుగుతుంది. ఏం లేదు వసు..నాకు తలనొప్పిగా ఉంది వెళ్లి నిద్రపో అనేస్తుంది. కాఫీ ఇవ్వనా, ట్యాబ్లెట్ తేనా అని వసూ అడిగితే..కాఫీ నేను పెట్టుకోగలను, టాబ్ లెట్ నేనూ తెచ్చుకోగలను అని వెళ్లిపోతుంది. వసు మేడమ్ కి ఏమైంది ఎందుకింత డల్ గా ఉన్నారని ఆలోచిస్తుంది.

రిషి-మహేంద్ర
మనోడు ఇంకా మౌత్ ఆర్గాన్ వాయిస్తూనే కూర్చుంటాడు. వసు గుడ్ నైట్ మెసేజ్ చూసి ఓహో..రిప్లై ఇవ్వలేదని గుడ్ నైట్ అని పెట్టిందా.. అంటే మెసేజ్ పంపొద్దనా, నేను ఇప్పుడు ఫోన్‌ చేస్తే అనుకుని.. టైం చాలా అయింది.. నిద్రపోతుందేమో అనుకుని ఆగిపోతాడు. వాళ్లమేడమ్ తనని ఏమైనా అడిగి ఉంటుందా..అడిగితే ఎలా అడుగుతుంది, నన్ను బ్లేమ్ చేస్తుందా..ఏం చేసినా పర్లేదు..వసుధారను అక్కడ నుంచి పంపించాలి అనుకుని.. వసుతో కలసి ఉన్న ఫొటోస్ చూస్తూ మహేంద్ర ఫొటో దగ్గర ఆగిపోతాడు. లేచి మహేంద్ర రూమ్ కి వెళ్తాడు.. మహేంద్ర నిద్రపోయి ఉంటాడు. రిషీ మహేంద్ర చేయి పట్టుకుంటాడు. కొడుకుని గమనించి లేచి కూర్చుంటాడు మహేంద్ర. నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని మహేంద్ర అడిగితే..ఇందాకే డాడ్.. నిద్రపట్టటం లేదు వచ్చాను..ప్రతీసారీ మీరు నన్ను డిస్టబ్ చేస్తారు కదా ప్రేమగా..ఇప్పుడు నా వొంతు అనుకోండి అంటాడు. చెప్పండి డాడ్ అని రిషీ అంటే ఏం చెప్పమంటావ్ అని మహేంద్ర అడిగితే.. ఏదైనా కబుర్లు చెప్పండి అంటాడు రిషి. చిన్నప్పుడు కూడా ఇలానే అడిగేవాడివి అని రిషీ అంటే..నేను ఎప్పుడూ మీముందు చిన్నవాడ్నే కదా డాడ్ అంటే.. నువ్వింకా చిన్న పిల్లాడివా అంటాడు మహేంద్ర.. .మనసెప్పుడూ పసిదే కదా అంటాడు రిషి. మనసుని అప్పుడప్పుడు వదలాలి-అప్పుడప్పుడు కళ్లెం వేయాలి-అన్నీ మనసులోనే దాచుకుంటే కష్టం నాయనా అంటాడు మహేంద్ర. రిషీ కొటేషనా , సజిషనా అంటే.. మామూలుగా అయితే కొటేషన్..కొడుక్కి చెబుతున్నా కదా అందుకే సజిషన్ అంటాడు మహేంద్ర. సరే గుడ్ నైట్ చెప్పి రిషీ లేస్తాడు..మహేంద్ర.. రిషి వెళుతూ ఈ రూమ్ తలుపులు మూసి పెట్టు..నీ మనసు తలుపులు తీసిపెట్టి అంటాడు.

తెల్లారింది.
కాలేజీకి రెడీ అయిన జగతి.. వసుధారని ఇంట్లోంచి ఎందుకు పంపించేయాలని ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధార కాఫీ ఇస్తుంది. ఇంకా మేడం డల్ గా కనిపిస్తున్నారు ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది వసుధార. కాఫీ పక్కన పెట్టేసిన జగతిని.. పక్కన పెట్టారెందుకు అని వసు అడుగుతుంది. మనకు నచ్చినా,నచ్చకపోయినా కొన్ని పక్కన పెట్టాల్సి వస్తుందంటుంది జగతి. మీకు కాఫీ నచ్చకపోతే మళ్లీ కలుపుతా అంటుంది వసుధార. నచ్చని ప్రతి విషయాన్ని మార్చలేం కదా అనేసి ఆ కాఫీ బాధగా ఒంపేస్తుంది. వసు మాట్లాడేందుకు ప్రయత్నించినా జగతి ముభావంగానే ఉండిపోతుంది. నేను ఒంటరిదాన్ని నాకు అలవాటే అన్నీ నువ్వంటే మధ్యలో వచ్చావ్..నువ్వు నాతో జీవితాంతం ఉండవు కదా కాఫీ కలుపుకుంటాలే అనేస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్న రిషి..ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని గౌతమ్ ని అడుగుతాడు. వసు దగ్గరకు అని తెలియగానే కారు ఆపేసిన రిషి… అర్జెంట్ పని ఉందంటే పొద్దున్నే వచ్చా ఇంత పొద్దున్నే ఆమెతో నీకేం పని అంటాడు. ఇది కరెక్ట్ కాదని రిషి చెప్పినా గౌతమ్ ఒప్పుకోడు.

కట్ చేస్తే.. రూమ్ లో ఒంటరిగా కూర్చున్న వసుధార మేడంలో ఏదో మార్పొచ్చిందని అనుకుంటుంది. జగతి రిషీ చెప్తే చేయాలా..ఈమెకంటూ..సొంత నిర్ణయం ఉండదా..పాపం..వసూ వచ్చి కాఫీ ఇస్తుంది. జగతి ఒక సిప్ వేసి..పక్కన పెట్టేస్తుంది. వసూ ఏమైంది మేడమ్, కాఫీ పక్కన పెట్టారేంటి అంటుంది. జగతి ఒక్కోసారి మనసుకు నచ్చినవైనా పక్కన పెట్టాలి అంటుంది జగతి. ఏమైంది మేడమ్ కాఫీ బాలేదా అంటే..నువ్వు కాఫీ ఇచ్చావ్, నేను తీసుకున్నాను..ఇప్పుడు సర్టిఫెకెట్ ఇవ్వాలా అని..కాఫీ తీసుకెళ్లి షింక్ లో వేస్తుంది. వసూ ఏమైంది మేడమ్..కావాలంటే మళ్లీ కలుపుతాను అంటుంది. అక్కర్లేదు వసూ..నేను కలుపుకుంటాను కదా, నేను ఒంటరిదాన్ని, మధ్యలో వచ్చావు..జీవితాంతం ఉండవు కదా అంటుంది..

మరోపక్క రిషీ – గౌతమ్ కారులో బయలుదేరుతారు. గౌతమ్..రిషీకి బిస్కెట్స్ వేస్తాడు. రిషీ మోసింది చాల్లేగానీ..ఎక్కడికి వెళ్లాలో చెప్పు అంటాడు. గౌతమ్ ల్యాండ్ మార్క్ చెప్తాను..వెళ్దాము అంటాడు. ఎక్కడికిరా అని రిషీ అంటే..గౌతమ్ చేసేదేమి లేక..వసుధార ఇంటికి వెళ్దాం అంటాడు. రిషీ మొదట కోపపడతాడు..గౌతమ్ ఎలాగోలా కన్విన్స్ చేస్తాడు. కారు స్టాట్ చేస్తాడు.

ఇక్కడ వసూ జగతి ప్రవర్తన ఆలోచిస్తూ ఉంటుంది. మేడమ్ లో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది..ఏమై ఉంటుంది అనుకుని..ఫోన్ చూసి జగతి దగ్గరకు వెళ్తుంది. మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే..కాలేజ్ టైం అయింది వెళ్తున్నాను అంటుంది. మీరు ఇంకా లంచ్ ప్రీపేర్ చేయలేదు, బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు అని వసూ అంటే..నేను లంచ్ రెడీ చేశాను అని వంటగదిలోకి వెళ్లి తన బాక్స్ తీసుకుని వస్తుంది. నేను నా మట్టుకు సరిపోయే అంత లంచ్ చేసుకున్నాను అని వెళ్తుంది. వసూ నేను కూడా వస్తాను, ఉండొచ్చుకదా అంటే..జగతి.. అన్నిసార్లు మనకోసం ఆగవు..సౌకర్యాలు-విలాసాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే మేఘాల్లాంటివి మనసు అన్నింటికీ అలవాటు పడాలి..ప్రతిరోజూ కారు అలవాటైందా..ఆటోలో కాలేజీకి వచ్చెయ్ అని సీరియస్ గా చెప్పి..లంచ్ నా వరకే చేసుకున్నాను, నీకు కావల్సింది ఏదో నువ్వు వండుకో అంటుంది. ఏంటి మేడం కొత్తగా అన్న వసుతో అన్నింటికీ ప్రశ్నలు వేయడం సరికాదు.. ఒక్కోసారి కొన్ని నేర్చుకోవాలి నువ్వు ఒంటరిగా రావడం నేర్చుకో అనేసి వెళ్లిపోతుంది. ఏమైంది మేడంకి ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని బాధపడుతుంది వసుధార. జగతి ఓ దగ్గర కారు ఆపేసి వసు నా మనసు తొందరగా అర్థం చేసుకో అని ఏడుస్తూ..ఖాళీ లంచ్ బాక్స్ చూసి బాధపడుతూ సారీ వసు అనుకుంటుంది.

జగతి ఇంటికి రిషి-గౌతమ్ వస్తారు. గౌతమ్ వసుధార ఇంటికి వచ్చి..అరే ఇక్కడ మాటలు, కథలు, దర్శకత్వం అన్నీ నావే..నువ్వు ప్రేక్షకుడిలా చూస్తూ ఉండాలి అంటాడు. రేయ్ ఎక్కువ చేయకు అంటాడు రిషీ..అప్పుడప్పుడు కాస్త ఎక్కువ చేస్తేనే బాగుంటుందిరా అంటాడు.. ఇంటి ముందు నిల్చుని ఉన్న వసుధారని చూసి గౌతమ్ కారు దిగి వెళతాడు. పొద్దున్నే వచ్చామనే షాక్ లో ఉన్నారా..రిషి వస్తుంటే తనతో పాటూ వచ్చేశా అంటాడు గౌతమ్..రిషీ కూడా వస్తాడు. వసూ డల్ గా గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. వసు డల్ గా ఉందంటే జగతి మేడం నేను చెప్పిన పని మొదలు పెట్టారా అనుకుంటాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news