Sumanth : ఇంట్రెస్టింగ్ గా “మళ్ళీ మొదలైంది” ట్రైలర్

-

హీరో సుమంత్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో పెద్ద హిట్ కొట్టిన సుమంత్… వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో వస్తున్నాడు హీరో సుమంత్. సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “మళ్ళీ మొదలైంది”.

ఈజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ కు జోడిగా నైనా గంగూలీ కనిపించనున్నారు. టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ వర్షిని కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్… విడుదల చేశారు. ” కొన్ని పెళ్లిళ్లు విడాకులే ముగింపు… అలాగే కొన్ని విడాకులకు ముగింపు…” అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. వ్యక్తిగత కారణాల వల్ల.. పరస్పర అంగీకారంతో విడిపోయిన భార్య భర్తలు గా సుమంత్ మరియు వర్షిని… పవిత్ర అనే లాయర్ గా నైనా గంగూలి నటన అందరినీ ఆకట్టుకుంది. అలాగే సుమంత్ చెప్పే డైలాగులు కూడా అందరినీ మెప్పించాయి. ఇంకా ఈ సినిమా లో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, పృథ్వి రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news