అహం ఎక్కువ కాలం పనిచేయదు : ఖర్గే

-

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయ దుందుభి మ్రోగించింది. అయితే.. మూడేళ్లుగా కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడిందన్నారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇది తన గెలుపో.. సిద్ధరామయ్య గెలుపో కాదని.. కర్ణాటక ప్రజల విజయమని అన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారని చెప్పారు. ఇచ్చిన హామీలను తాను సిద్ధరామయ్య కలిసి నెరవేరుస్తామని చెప్పారు డీకే శివకుమార్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా కలిసి కృతజ్ఞత సమావేశం నిర్వహించారు.

Mallikarjun Kharge Is Chief - Congress Sticks To What It Knows

ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అహం ఎక్కువ కాలం పనిచేయదన్నారు. ఇది ప్రజాస్వామ్యమని..ప్రజల మాట తప్పకుండా వినాలని చెప్పారు. ఇది ఎవరి విజయం కాదని.. రాష్ట్రప్రజల విజయమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు కాబట్టే కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిచిందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర సాగిందని.. రాహుల్ గాంధీ నడిచిన రూట్‌లో దాదాపు 99శాతం సీట్లు గెలుచుకున్నామన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65,జేడీఎస్ 19 ,ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. మే 14న సాయంత్రం 5.30గంటలకు జరగనుంది. ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో సిద్ధరామయ్య,డీకే శివకుమార్ ఇద్దరు ఉన్నారు. మరి అధిష్టానం వీరిలో ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఉత్కంఠగా ఉంది. మే 15న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news