ఈ మధ్య కాలంలో హైదరాబద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద సీరియస్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకసారి తాగి నడుపుతూ దొరికితే కనుక డైరెక్ట్ గా దానిని సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో మందుబాబులు భయపడుతున్నారు. అలా ఒక మందుబాబు మందేసి భార్యను ఎక్కించుకుని రోడ్డు ఎక్కాడు.
పోలీసులు కనిపించడంతో భార్యను బండిని రోడ్డు మీదనే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన చర్చనీయాంశం గా మారింది. ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లి బెంగళూరు జాతీయ రహదారి పై ట్రాఫిక్ పొలీసుల డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్ గమనించి భార్యను వదిలి పెట్టి రాజు అనే వ్యక్తి పరారు అయ్యాడు. అయితే ఆ మహిళకు అడ్రస్ తెలియకపోవడంతో ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయి అక్కడే ఎయిర్ పోర్ట్ లో ఏడుస్తూ కూర్చుంది. సీతను ఎయిర్ పోర్ట్ మొబైల్ పోలీసులు గమనించి పిఎస్ తీసుకొచ్చి భర్త రాజుని తీసుకొచ్చి మందలించి ఆమెను అప్పగించారు.