దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరుల్లో భేటీ అయ్యాయి. మూడోసారి ముంబైలో ఉమ్మడి భేటీని నిర్వహించబోతోన్నాయి. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల అధినేతలు ముంబైకి చేరుకున్నారు. ఈ విడత సమావేశంలోనే ఇండియా లోగోను కూడా ఆవిష్కరించనున్నాయి. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు: ఎప్పట్నుంచంటే..?, ఎల్లో అలర్ట్ జారీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముంబైకి చేరుకున్నారు కూడా.
ఈ మధ్యాహ్నం ముంబైకి వచ్చిన ఆమె నేరుగా జుహూలోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయనను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో బుధవారం అమితాబ్ కుటుంబ సభ్యులతో దీదీ కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… అమితాబ్ నివాసానికి రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆయనకు రాఖీ కట్టినట్లు చెప్పారు. అమితాబ్ కుటుంబం అంటే తనకు ఎనలేని ఇష్టమని, ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు. బెంగాల్‌లో దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కూడా మమత రాఖీ కట్టారు.