ఒక నెలలో వచ్చే 2వ పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. ఆగస్టు 1న మొదటిది రాగా, కాసేపట్లో రెండోది కనిపించనుంది. ఇవాళ చంద్రుడు సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. అలాగే అరుదైన సూపర్ బ్లూ మూన్ (చంద్రుడి కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు) రేపు ఏర్పడనుంది. బ్లూ మూన్ ఇవాళ రాత్రి 9.30 గం.కు, సూపర్ బ్లూ మూన్ రేపు ఉ.7.30 గం.కు చూడవచ్చు. ఇలా ఒక బ్లూ మూన్, సూపర్ బ్లూ మూన్ కలిసి రావడం 2037 వరకు మళ్లీ ఏర్పడదు.
బ్లూ మూన్ అంటే..?
బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు.