పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ప్రజలకు దగ్గర కావడానికి కాస్త గట్టిగా కష్టపడుతున్నారు. మమతా బెనర్జీ రాష్ట్రంలోని అలీపూర్దుర్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో డాన్స్ వేసిన ఒక వీడియో వైరల్ అయింది. అలీపూర్దుర్ జిల్లాలోని ఫలకాటలో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు.
సామూహిక వివాహ వేడుకలో ఇతర గిరిజన నృత్యకారులతో చేతులు కలిపిన మమతా బెనర్జీ… డ్రమ్స్ కొట్టుకుంటూ డ్యాన్స్ చేయడం కనిపించింది. సామూహిక వివాహ కార్యక్రమంలో మమతా బెనర్జీ డ్యాన్స్ చేస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏ ఎన్ ఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇతర నృత్యకారులతో పాటు మమతా బెనర్జీ ఆనందంగా నృత్యం చేయడం వీడియోలో ఉంది.
ఆ తర్వాత ఆమె నృత్యకారులను వదిలి మరొకరి దగ్గరకు వెళ్ళారు. అయితే ఇదే మొదటిసారి కాదు. కోల్కతాలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో గిరిజన సంగీత విద్వాంసుడు బసంతి హేంబ్రామ్తో కలిసి మమతా బెనర్జీ నృత్యంలో పాల్గొనడం కనిపించింది. గత ఏడాది పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో, గజోల్లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో మమతా బెనర్జీ గిరిజన పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. సామూహిక వివాహ వేడుకలలో ఆమె ముందు నుంచి కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee dances during a mass marriage ceremony in Falakata of Alipurduar district. pic.twitter.com/zIDyhRDS7x
— ANI (@ANI) February 2, 2021