భట్టికి అవమానం అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం.. మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు నిన్న యాదాద్రి సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీట పై కూర్చోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు నిన్నటి నుంచి విమర్శిస్తున్నారు. దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేది అని విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  భట్టి విక్రమార్క పీటపై కూర్చోవడం పట్ల బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పై మల్లు రవి తాజాగా ఫైర్ అయ్యారు. యాదగిరిగుట్ట వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసన్నారు. గుట్టలో గతంలో బీఆర్ఎస్ దళితులను అవమానించిన తీరు ప్రజలందరికీ తెలుసు అన్నారు. సానుభూతి కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తామంతా నుంచి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news