దారుణం: మనిషి రోడ్డుపై పడిపోయినా కన్నెత్తి చూడని జనం …!

-

రోజరోజుకు కరోనా భయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోతోంది. దీంతో మనుషుల్లో మానవత్వం మంటకలుస్తోంది. ఓ యువకుడు నడిరోడ్డుపై కుప్పకూలిన ఎవరూ పట్టించుకోని సంఘటన తాజాగా హైదరాబాద్ నగరంలోని ఏఎస్ రావు నగర్ లో చోటు చేసుకుంది. ఆ యువకుడిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లలేని ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… శామీర్ పేట మండలం జవహర్ నగర్ కు చెందిన పృథ్విరాజ్ అనే వ్యక్తికి గత మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరగా అక్కడ ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ వెళ్లాలని సూచించారు. అయితే ఆ యువకుని వేరే ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ఆటోలో ఎక్కిస్తుండగా ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి కిందపడిపోయాడు. దీనితో అక్కడ ఉన్న స్థానికులు కొందరు 108కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి పరిశీలించగా సదరు వ్యక్తి మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఆ యువకుడిని చేరదీసేందుకు ఎటువంటి సాహసం ఎవరూ చేయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news