తొలి ఏడాది అంతా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిన జగన్.. రెండో ఏడాది మొత్తం అభివృద్ధిపై దృష్టిసారించబోతున్నారని వార్తలు వస్తున్నాయి… పక్కరాష్ట్రాల నేతలు సైతం జగన్ పాలనపై ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు… కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులను పక్కనపెట్టి పనులు చేస్తున్నారు… మరి ఇలాంటప్పుడు కరువు రావడం ఏమిటి? ఏపీలో వచ్చిన ఆ కొత్త కరువు ఏమిటి?
అవును.. ఏపీలో కొత్తరకం కరువు వచ్చింది… అదే ప్రతిపక్షాల మాటల కరువు! ఏదో చేయాలికాబట్టి చేసే విమర్శలే తప్ప.. కనస్ట్రక్టివ్ విమర్శలు చేసే పరిస్థితి ప్రతిపక్షాలకు లేకుండా.. జగన్ వారి నోళ్లు నొక్కేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన! అవును… విశాఖపట్నం రూరల్ పరిధిలోని వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి మే 7న అర్ధరాత్రి స్టైరీన్ గ్యాస్ లీకైంది. అంటే సరిగ్గ నేటికి రెండు నెలలు అయ్యింది!
నాడు.. విషయం తెలుసుకున్న జగన్ హుటాహుటిన విశాఖకు వెళ్లారు! ప్రమాధం జరిగిన అనంతరం ప్రతిపక్షాలు మైకుల ముందుకు వచ్చి, కమ్యునిస్టులు విశాఖకు వచ్చి నష్టపరిహారం డిమాండ్ చేసే లోపు.. కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. ఫలితంగా కమ్యునిస్టుల నోరు నొక్కేశారు. దాంతో వారి మాటలకూ కరువొచ్చింది.
ప్రమాధం జరిగిన అనంతరం కంపెనీ సీయీవో, బోర్డ్ డైరెక్టర్లతో జగన్.. ప్రమాధానికి గల ప్రాథమిక కారణాలు అడిగి తెలుసుకుంటున్న ఫోటోలను చూపించి.. బేరాలు ఆడుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అనంతరం ఒక హైపర్ కమిటీని నియమించారు జగన్. దాని రిపోర్ట్ కూడా వచ్చింది… సరిగ్గా ప్రమాధం జరిగిన రెండు నెలలలోపు రిపోర్ట్ రావడం.. ఆ ప్రమాధానికి కారణమైన 12మందిని అరెస్టుచేయడం జరిగిపోయింది.
అరెస్టయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ ఎండీ అండ్ సీఈవో సాంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు సహా ఇన్ చార్జీలు, ప్రొడక్షన్ ఇంజనీర్ విభాగాల వారున్నారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కి నోరు నొక్కేసినట్లయ్యింది. ఫలితంగా టీడీపీ నేతలకు కూడా ఈ విషయంలో మాటల కరువు వచ్చేసింది.