యువతీ యువకులు ఎవరైనా సరే.. తమకు నచ్చిన పార్ట్‌నర్ దొరికితే వారిని ప్రేమించి వారిని లైఫ్ పార్ట్‌నర్స్‌గా మార్చుకుంటారు. అది వీలుకాకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఆ రెండు విధాలుగా కూడా యత్నించాడు. కానీ తనకు కావల్సిన జీవిత భాగస్వామి దొరకలేదు. దీంతో ఏకంగా ఫేస్‌బుక్‌లో తనను తాను అమ్మకానికి పెట్టుకున్నాడు. అది కూడా ఉచితంగానే కావడం విశేషం.
యూకేలోని కెటెరింగ్ అనే ప్రాంతానికి చెందిన అలన్ క్లేటాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి ఎంతో కాలం నుంచి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. కానీ అతనికి సరైన లైఫ్ పార్ట్‌నర్ దొరకడం లేదు. ఒక యువతితో డేటింగ్ కూడా చేశాడు. కానీ అది సెట్ అవ్వలేదు. దీంతో డేటింగ్ సైట్ల ద్వారా ఎవరినైనా తోడుగా వెదుక్కోవాలనుకున్నాడు. కాకపోతే ఆయా సైట్ల వారు అలన్‌ను అనేక ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతను ఫేస్‌బుక్‌లో ఉండే ఐటమ్స్ ఫర్ సేల్ పేజీలో తనను తాను ఉచితంగా అమ్మకానికి పెట్టుకున్నాడు.
హలో లేడీస్.. నేను అలన్.. నా వయస్సు 30 ఏళ్లు. నేను ఒక అందమైన లేడీ కోసం ఎదురు చూస్తున్నా. ఆమెతో మాట్లాడాలని అనుకుంటున్నా. కుదిరితే లైఫ్ పార్ట్‌నర్‌ను చేసుకుంటా. నేను అనేక పెళ్లిళ్లలకు ఒంటరిగా వెళ్లాల్సి వస్తోంది. త్వరలో మరిన్ని వెడ్డింగ్స్‌కు హాజరు కావల్సి ఉంది. నేను వాటికి ఒంటరిగా వెళ్లకూడదని అనుకుంటున్నా. కనుక ఒక పార్ట్‌నర్ కోసం చూస్తున్నా. ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పండి.. అంటూ అలన్ ఫేస్‌బుక్ లో యాడ్‌ను పోస్ట్ చేశాడు. దానికి యూకే వ్యాప్తంగా విపరీతమైన స్పందన లభించింది. అనేక మంది మహిళలను అలన్‌తో జీవిత ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అలన్ ఇప్పుడు వారిలో తనకు నచ్చిన ఒక మహిళను ముందుగా డేట్‌కు తీసుకువెళ్లి తరువాత పెళ్లి చేసుకోనున్నాడు. మరి అతను ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.
ఇక అలన్ అలా యాడ్ పోస్ట్ చేసే సరికి అందరూ అతనికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. ఎవరినైనా లైఫ్ పార్ట్‌నర్‌గా ఎంపిక చేసుకుంటే ఆమెతో ఫొటో దిగి మళ్లీ ఫేస్ బుక్‌లో పెట్టాలని నెటిజన్లు అతన్ని కోరుతున్నారు. ఇక అతను ఎవరిని ఎంపిక చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.