వీడెం మనిషి : తండ్రి ల్యాప్ టాప్ లో కూతురి న్యూడ్స్ !

-

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కామాంధుడు కూతురు అని కూడా చూడకుండా కూతురి న్యూడ్ ఫోటోలు తన ల్యాప్ టాప్ లో సేవ్ చేసుకున్నాడు. ఈయన గారు నాచారంలో ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమెను కన్న కూతురిలా చూసుకోవాల్సిన అతను రెండో భార్య, కూతురికి కూడా తెలియకుండా రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి ఫోటోలు తీసుకుని దాచుకున్నాడు.

rape
rape

తన తండ్రి ల్యాప్ ట్యాప్ లో ఫోటో లు చూసి తల్లడిల్లిన కూతురు, అదే మనసులో పెట్టుకుని క్రుంగిపోయింది. తన తల్లి సహాయంతో నాచారం పోలీసులకు కూతురు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో నిందితుడిని మొదట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కరోనా సోకడంతో మందలించి పంపేశారు. ఇప్పుడు కరోనా తగ్గటంతో మళ్లీ అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు, నిందితుడి పై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news