హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొలువాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిల్ల మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం.

ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా పోతాయని శాస్ర్తాలు చెపుతున్నాయి.
హనుమద్ ఉపాసన ప్రక్రియ లోకవిదితమే
పిల్లలు పుట్టడానికి ఉన్న గ్రహదోషాలు, నవగ్రహ దోషాలు అదేవిధంగా కార్యల్లో ఆటంకాలు, భయం పోవడానికి సుదరాకాండ పారాయణం చాలా ప్రశస్తి. అవకాశాన్ని బట్టి సుందరాకాండ పారాయణాన్ని చేయించుకుంటే సకల దోషాలు పోయి సర్వకార్య జయం కలుగుతుంది.