బిగ్ బాస్ హోస్ట్ గా మంచు విష్ణు! ట్రోలింగ్ షురూ.!

-

అక్కినేని నాగార్జున  బిగ్ బాస్ షో ను వదిలి పెడుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాను నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని కోరుతున్న నేపథ్యంలో లో బిగ్ బాస్ షో కు గుడ్ బై చెబుతున్నారు.

దానితో పాటు బిగ్ బాస్ షో రేటింగ్స్ కూడా ఇయర్ ఇయర్ కు తగ్గిపోతున్నాయి. దానితో  నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.దీంతో వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా విజయ్ దేవరకొండ మరియు జూ ఎన్టీఆర్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  జూ ఎన్టీఆర్ కు ఎంత అమౌంట్ అయినా ఇచ్చి లాక్ చేయాలని ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది.

ఇప్పుడు ఈ విషయంలో మరో విచిత్రమైన న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పుడు హోస్ట్ గా మంచు విష్ణు ను అడుగుతున్నారని రూమర్ ప్రచారంలోకి వచ్చింది. కాని దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఆయన తెలుగు భాష ప్రావీణ్యం చూసి ఎంపిక చేస్తున్నా రని వెటకారం కలిపి కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది టంగటూరి ఒక్క డైలాగ్ మాత్రమే హోస్ట్ కు దారి చూపింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మంచు లక్ష్మి అయితే కొంత న్యాయం చేస్తుందని సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news