చిరంజీవిని ఛాలెంజ్‌ చేస్తున్న మంచు విష్ణు !

-

Godfather : మెగాస్టార్​ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహన్​ రాజా కాంబో తెర‌కెక్కుతున్న చిత్రం గాడ్ ఫాద‌ర్. పవర్​ఫుల్ పొలిటికల్​ డ్రామాగా ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాలంలో సూపర్​హిట్​ అయినా.. లూసిఫర్​కు సినిమాకు ఇది రీమేక్​. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర అయిన హీరో సోద‌రిగా తెలుగులో నయనతార పోషించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా.. గాడ్‌ ఫాదర్‌ సినిమాను దసరా కానుకగా అంటే అక్టోబర్ 5న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

అయితే.. గాడ్‌ ఫాదర్‌ సినిమా బృందం ఈ తేదీని ప్రకటించిన తర్వాత.. మంచు విష్ణు తన జిన్నా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జిన్నా సినిమాను కూడా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా పేర్కొన్నారు. దీంతో దసరాకు చిరంజీవితో మంచు విష్ణు పోటీ పడబోతున్నాడన్న మాట. అయితే.. ఇందులో ఏ సినిమా హిట్‌ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version