మంచు విష్ణు “జిన్నా” టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు

-

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు.

వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు. ఇటీవలే ఈ చిత్రం నుండి సన్నీలియోన్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి ఫుల్ రెస్పాండ్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఫుల్ లెన్త్ రోల్ చేస్తోంది. ఇక తాజా అప్డేట్ ప్రకారం జిన్నా టీజర్ ను ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news