అదేంటో గాని మంత్రులుగా పనిచేసినవారు ఎక్కువ శాతం ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఉంటారు. ఏదో కొంతమంది తప్ప…మెజారిటీ సంఖ్యలో మాత్రం మంత్రులు ఓడిపోతూ ఉంటారు. అంటే మంత్రులుగా పనిచేస్తూ…సొంత నియోజకవర్గాలపై సరిగ్గా ఫోకస్ పెట్టి పనిచేయకపోవడం, రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావడం…అలాగే మంత్రులు అయ్యాక కొందరిపై విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం, ఇక మంత్రులు సరిగ్గా పనిచేయకపోవడం, కేవలం సంతకాలు పెట్టడం కోసమే మంత్రులుగా ఉంటూ, వ్యక్తిగతంగా అధికారాలు లేకపోవడం..ఇలా కారణం ఏదైనా గాని…ఒకసారి మంత్రిగా పనిచేస్తే చాలు…నెక్స్ట్ ఎన్నికల్లో వారు గెలవడం చాలా కష్టమైపోతుంది.
ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పలువురు మంత్రులు జెండా పీకేసేలా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో 25 మంది మంత్రులు ఉన్నారు. అంతకముందు 14 మంది మంత్రులు మాజీలు అయ్యారు. ఓవరాల్ గా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు 39 మంది…మధ్యలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ కూడా మంత్రులుగా పనిచేశారు. అయితే వారు తర్వాత రాజ్యసభకు వెళ్ళిపోయారు. వాళ్ళని పక్కన పెడితే….14 మంది మంత్రులుగా పనిచేసిన వారు…ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న 25 మందిలో మళ్ళీ ఎంతమంది నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తారు? అంటే చెప్పలేని పరిస్తితి.
కాకపోతే ఇక్కడ మాజీ మంత్రులకు కొంత అడ్వాంటేజ్ ఉంది…మొన్నటివరకు మంత్రులుగా ఉన్నప్పుడు వారికి తమ తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి పనిచేసే ఛాన్స్ రాలేదు. కానీ మాజీ మంత్రులయ్యాక ఆ ఛాన్స్ వచ్చింది. కాబట్టి మాజీ మంత్రుల్లో కొందరు మళ్ళీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం మంత్రులుగా పనిచేసే వారి పరిస్తితి ఏంటి అనేది తెలియడం లేదు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు దాదాపు ఓటమి పాలయ్యారు. ఏదో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్ రావు, చినరాజప్ప లాంటి వారు మాత్రమే గెలిచారు. మిగిలిన వారంతా ఓడిపోయారు. మరి నెక్స్ట్ వైసీపీలో ఎంతమంది మంత్రులు ఓటమి పాలవుతారో చూడాలి.