ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగా ఆమె స్థానంలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మ త్వరలోనే బాధ్యతలను చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగా ఆమె స్థానంలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మ త్వరలోనే బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో సీఎం జగన్ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని వాసిరెడ్డి పద్మకు కేటాయించారు.
కాగా వాసిరెడ్డి పద్మ కృష్ణా జిల్లా వాసి. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీ తరఫున ప్రతి విషయంలోనూ ఆమె ప్రతి చోటా బలంగా వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. వైసీపీలో అంబటి రాంబాబుకు ఎంత వాక్చాతుర్యం ఉంటుందో.. దాదాపుగా అంతే దీటుగా వాసిరెడ్డి పద్మ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. అప్పట్లో వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పద్మ టీడీపీ నేతలకు పలు విషయాల్లో కౌంటర్లు కూడా ఇచ్చారు.
ఇక వాసిరెడ్డి పద్మ గొప్ప నాయకురాలు అయినప్పటికీ ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో జగన్ ఆమెకు నామినేటెడ్ పోస్టు ఇద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే ఇక ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని ఆమె చేపట్టనున్నారు. కాగా నన్నపనేని రాజకుమారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మకు జగన్ ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది..!