శ్రీలంక ముందు తేలిపోయిన బంగ్లాదేశ్ … 164 కే ఆల్ ఔట్

-

ఆసియా కప్ 2023 లో భాగంగా ఈ రోజు పల్లెకేలే స్టేడియం లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా , మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. 42 .4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి కేవలం 164 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బంగ్లా ఆటగాళ్లలో కేవలం శాంటో ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టుకు ఆ మాత్రమే స్కోర్ అయినా సాధించి పెట్టాడు.. ఇతను తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్ల సహాయంతో 89 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు, 11 పరుగులు వెనుకబడి సెంచరీ ని మిస్ చేసుకున్నాడు. ఇతనికి ఏ ఒక్కరి నుండి కూడా సరైన సహకారం లభించకపోవడంతో టీం స్కోర్ 164 కు పరిమితం అయింది.

శ్రీలంక బౌలర్లలో పతిరాణ వికెట్లు తీయగా, తీక్షణ రెండు వికెట్లతో అలరించాడు. మరి ఛేదనలో శ్రీలంక ఈ స్కోర్ ను సునాయాసంగా సాధిస్తుందా లేదా బంగ్లా తన బౌలింగ్ తో టైట్ చేస్తుందా చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news